కరోనా భయం..హెయిర్ కటింగ్ ఎలా చేస్తుందో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భయం..హెయిర్ కటింగ్ ఎలా చేస్తుందో చూడండి

March 27, 2020

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు 198 దేశాలకు ఈ వైరస్ పాకింది. ఐదు లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 27 వేల మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 85 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనా సోకకుండా తమకు తోచిన విధానాలను పాటిస్తున్నారు. మాస్కు ధరిస్తున్నారు. మరికొందరు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజేర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణ యజమానులు కస్టమర్ల నుంచి తమకు కరోనా రాకుండా సోషల్ డిస్టన్స్ పాటిస్తున్నారు.

 

Publiée par Bella Rosa sur Mercredi 18 mars 2020

 

ఈ నేపథ్యంలో హాలాండ్‌లోని బెల్లా రోజ్ సెలూన్‌‌లో హెయిర్ స్టైలిష్ట్.. కరోనా సమయంలోనూ కటింగులు చేస్తోంది. కస్టమర్ల నుంచి తనకు కరోనా సోకకుండా ఉండేందుకు గొడుగును అడ్డంగా పెట్టుకుంటోంది. గొడుకు రెండు పెద్ద రంథ్రాలు, రెండు చిన్న రంథ్రాలు చేసింది. పెద్ద రంథ్రాల నుంచి చేతులను పెట్టి.. చిన్న రంథ్రాల నుంచి చూస్తూ కటింగ్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Publiée par Bella Rosa sur Mercredi 18 mars 2020