కరోనా మహత్యం.. వినూత్నంగా హల్దీ వేడుక ( వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మహత్యం.. వినూత్నంగా హల్దీ వేడుక ( వీడియో)

September 30, 2020

NMNFB

కరోనా దేశంలోకి వచ్చిన తర్వాత మనిషికి మనిషి దగ్గరగా ఉండటానికే భయపడిపోతున్నారు. ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. శుభకార్యాల్లోనూ కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వధువుకు జరిగిన హల్దీ వేడకను కొంత మంది వినూత్నంగా నిర్వహించారు. పేయింటింగ్ రోలర్‌తో హల్దీ పూస్తూ వేడుక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను హర్జిందర్ సింగ్ క్రేజా ట్విట్ చేయడంతో అది వైరల్ అయింది.  

పెళ్లికి ముందు వధూ వరులకు  హల్దీ వేడుక నిర్వహించడం సహజం. ఒకరికొకరు పసుపు పూసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషంగా గడుపుతారు. కానీ కరోనా నేపథ్యంలో ఇలా చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇంకేముంది ఓ వినూత్న పద్దతికి తెరలేపారు. వధువుకు పెయింటింగ్ రోలర్ సాయంతో శరీరం అంతా పసుపు పూశారు. మాస్కులు ధరించిన ఓ మహిళ పొడవైన కర్ర సాయంతో హల్దీ పూసింది. దీంతో చుట్టుపక్కల వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. దీన్ని చూసిన నెటిజన్లు వారి ప్రయత్నానికి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.