గీతా ఆర్ట్స్ వద్ద అర్ధనగ్నంగా నటి నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

గీతా ఆర్ట్స్ వద్ద అర్ధనగ్నంగా నటి నిరసన

May 9, 2022

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఓ మహిళా నటి, ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ”గీతా ఆర్ట్స్ వారు నాకు చాలా డబ్బులు ఇవ్వాలి. నా డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి” అంటూ ఆ మహిళ అర్టిస్ట్ ఈరోజు ఉదయం 5.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా ఆందోళనకు దిగింది.

ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సర్థి చెప్పిన వినకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మాట్లాడుతూ.. ‘నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద అర్థనగ్నంగా ధర్నా చేసింది. ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించి, సునీతను పోలీస్‌ స్టేషన్‌కు తరలించాం. ఆమెకు గతకొన్ని రోజులుగా మానసిక పిరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశామని గీతా ఆర్ట్స్ మేనేజర్లు చెప్పారు” అని అన్నారు.