నకిలీ నోట్లలో 40శాతం గుజరాత్ నుంచే - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ నోట్లలో 40శాతం గుజరాత్ నుంచే

September 6, 2017

గత ఏడాది నోట్ల రద్దు తర్వాత ప్రవేవపెట్టిన రూ. 2000 నోట్లకు నకిలీలు పుట్టుకురావడం తెలిసిందే. దేశవ్యాప్తంగా రూ. 66 లక్షల విలువైన 2వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏకంగా 40 శాతం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో దొరికాయి. వీటి విలువ రూ. 26 లక్షలు. గత ఏడాది నవంబర్ 9 నుంచి ఈ ఏడాది మార్చి 7 మధ్య వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 12 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.

అవినీతి నిరోధం, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ల తదితర లక్ష్యాలతో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఫలితాలు పెద్దగా రాలేదని ఇటీవల రిజర్వు బ్యాంకు వెల్లడించిన గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని ఆ నివేదికలో చెప్పారు. అంటే దేశంలో నల్లధనం అసలే లేదన్నమాట అని విపక్షాలు మండిపడుతున్నాయి.