హ్యాండ్‌బాల్ లీగ్ వేలం అదుర్స్.. జగన్‌మోహన్ రావు ఆధ్వర్యంలో - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాండ్‌బాల్ లీగ్ వేలం అదుర్స్.. జగన్‌మోహన్ రావు ఆధ్వర్యంలో

February 24, 2020

హ్యాండ్‌బాల్ ఆటకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్) వేలానికి చక్కని స్పందన లభిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోని ఆదివారం వేలం మొదలైంది. ఒక్కో టీఎంలో 12 మంది ఆటగాళ్ల చొప్పున 62 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. పీహెచ్ఎల్ చైర్మన్ అర్శానపల్లి జగన్ మోహన్ రావు ఆధ్వరంలో ఉత్కంఠభరితంగా ఆసక్తిగా సాగుతున్న వేలంలో టీముల ఓనర్లు భారీ ధరలు చెల్లించిన ఆటగాళ్లను సొంతం చేసుకుంటున్నారు. 

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ఇండియా పోటీలను ఈ ఏడాది మార్చి 5 నుండి 25 వరకు జైపూర్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ టైగర్స్, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూర్ రాష్ట్రాల టీంలు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను కూడా జగన్ మోహన్ రావుకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హ్యాండ్ బాల్ క్రీడను ప్రోత్సహించేందుకు జగన్ మోహన్ రావు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి స్పాన్సర్ షిప్ స్వయంగా కల్పించటంతో పాటు, వివిధ పోటీల్లో పాల్గొనేందుకు చేయూత అందిస్తున్నారు.