హ్యాండ్‌బాల్ లీగ్‌లో జగన్ మోహన్ రావుకు కీలక పదవి - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాండ్‌బాల్ లీగ్‌లో జగన్ మోహన్ రావుకు కీలక పదవి

January 17, 2020

Handball.

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హ్యాండ్ బాల్ క్రీడను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఎఫ్ఐ) అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరిశానపల్లికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను ప్రతిష్టాత్మక ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈ ఏడాది మార్చి 5 నుండి 25 వరకు జైపూర్‌లో నిర్వహించనున్న  ప్రీమియర్ హాండ్‌బాల్ లీగ్ ఇండియా పోటీల బాధ్యతలను కూడా జగన్ మోహన్ రావుకు అప్పగించారు. తెలంగాణ టైగర్స్, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూర్ రాష్ట్రాల టీంలు ఈ ప్లీగ్‌లో పాల్గొంటాయి. ప్రీమియర్ లీగ్ పాలక మండలి తీసుకునే నిర్ణయాల్లో జగన్ మోహన్ రావు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రీడకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశముంది. వివిధ టోర్నీలకు భారత్ వేదికగా మారొచ్చు.  

ఇటీవల స్వీడన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ కాంగ్రెస్‌లో భారత ప్రతినిధి బృందానికి ఆయన సారథ్యం వహించారు.  172 దేశాలు ఆ క్రీడల్లో పాల్గొన్నాయి. తెలంగాణకు చెందిన జగన్ మోహన్ రావు గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి స్పాన్సర్ షిప్ స్వయంగా కల్పించటంతో పాటు, వివిధ పోటీల్లో పాల్గొనేందుకు కృషిచేస్తున్నారు.