కాళ్లు లేకున్నా మండుటెండల్లో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల సలాం.. - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు లేకున్నా మండుటెండల్లో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల సలాం..

May 19, 2019

‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ.. పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ’ అని అంటుంటారు. కానీ ఇతణ్ణి చూశాక అది నిజమేనని అనిపిస్తోంది. రెండు కాళ్లు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. తాను ఎవరి ముందు తక్కువ కాదని నిరూపించుకుంటూ.. అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో‌లో ఓ దివ్యాంగుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ.. ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాడు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నా.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నాడు. అతనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు డెలివరీ బాయ్‌కి సలాం కొడుతున్నారు.  

కాగా గతంలో జొమాటోకు ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. కస్టమర్లకు ఇవ్వాల్సిన ఫుడ్ ను మధ్యలోనే మాయం చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో అనేక మంది జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు జొమాటో దివ్యాంగుడికి డెలివరీ బాయ్‌గా ఉద్యోగం ఇచ్చి, అతనికి దారి చూపడంతో అందరూ జొమాటో‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.