Handloom Textiles Enforcement Officers Raid South India Shopping Mall in Kothapet
mictv telugu

షాపింగ్‌మాల్స్‌కి వెళ్తున్న మహిళలూ.. తస్మాత్ జాగ్రత్త

November 18, 2022

Handloom Textiles Enforcement Officers Raid South India Shopping Mall in Kothapet

మహిళలకు బంగారం, చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లోకి ఏదైనా కొత్త నగల డిజైన్ వచ్చినా, కొత్త రకం చీర వచ్చినా.. వెంటనే చూడ్డానికో, కొనడానికో ఆసక్తి చూపుతారు. కానీ అలాంటి వారి ఉత్సుకతను షాపింగ్ మాల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చీరలపై నకిలీ స్టికర్స్ వేసి డబ్బులు దండుకుంటున్నాయి. తాజాగా అధికారులు జరిపిన ఈ దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది.

హైదరాబాద్‌ కొత్తపేటలోని ఓ షాపింగ్‌ మాల్‌లో హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ హ్యాండ్లూమ్‌ వస్త్రాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేశామని సంబంధిత అధికారి వెంకటేశం తెలిపారు. భారత ప్రభుత్వ చేనేత పరిరక్షణ చట్టం ప్రకారం.. 11 రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు తయారు చేసే అధికారాన్ని.. చేనేత కార్మికులకు రిజర్వ్ చేశామని చెప్పారు. కానీ ఈ మాల్‌లో మరమగ్గాల నుంచి తయారైన వాటిని చేనేత వస్త్రాల పేరుతో ప్రింట్‌ చేసి విక్రయిస్తున్నారని గుర్తించామని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెంకటేశం తెలిపారు.