అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇలాంటి శిక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇలాంటి శిక్ష!

March 14, 2018

చూస్తే అర్థం అయిపోతుందిగా.. తేడా ఏంటో..! చేతులు ఉండాల్సిన స్థానంలో కాళ్లు, కాళ్లు ఉండాల్సిన చోట చేతులు ఉన్నాయి. ఇతడు పొరుగింటి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నందుకు దేవుడు అంగాలను ఇలా తారుమారు చేశారని నెటిజనం గుసగుసలు పోతున్నారు.

 

సెక్స్, అక్రమ సంబంధాలు, కన్యత్వ అమ్మకాలు వంటి వార్తలకు బలం ఎక్కువ కాబట్టి ఈ ఫోటో సూక్ష్మజీవిలా వ్యాపించిపోయింది. వీడికి తగిన శాస్తి జరిగిందని సంతోష పడుతున్నారు.అయితే లోకంలో అందరూ వెర్రివాళ్లే వుండరు కనుక గుట్టు తొందరగానే వీడిపోయింది.

ఇతగాడి పేరు ముకైలా. నైజీరియా నటుడు. ఇలాంటి వింత వేషాలు అలవాటు. హకీమ్ ఎఫెక్ట్ అనే మేకప్ ఆర్టిస్టుతో ఇలా అవయవాలను తారుమారు చేయించుకున్నాడు. అంతే, అంతకుమించి మరేమీ లేదు. ఈ నిజం బయటపడ్డంతో నెటిజన్లు మరో పాట అందుకున్నారు.

ముకైలా అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు మహిళ భర్త కాళ్లూ, చేతులూ తారుమారు చేయడం కాకుండా ఏకంగా తీసేస్తాడు అని అంటున్నారు. కాగా, హకీమ్ ఇలాంటి మేకప్ కళలో అరితేరాడు. అందుకు రుజువులు ఈ ఫొటోలే.