నా కొడుకును ఉరి తీయండి.. పాషా తల్లి  - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకును ఉరి తీయండి.. పాషా తల్లి 

November 29, 2019

mother ......

26 ఏళ్ల ఆ కన్నవాళ్ల ప్రేమను కామం కళ్లకెక్కిన నీచులు ఒక్క క్షణంలో బూడిద చేశారు. ఆ బంగారుతల్లిని అతికిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి పెట్రోల్ పోసి ప్రియాంక రెడ్డిని హత్యచేశారు. ఎంత దారుణం.. ఆమెను కన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ఇలాంటి ఘటనలతో ఆడపిల్లలను కన్నవాళ్ల గుండెలు దడదడలాడుతున్నాయి. మగబిడ్డలను కన్నవాళ్లే వాళ్లను సరైన దారిలో పెంచాలి. తన బిడ్డ క్షమించరాని నేరం చేస్తే కడుపు తీపి దానిని కప్పి పుచ్చుతుందా? తన బిడ్డ క్రూరుడిగా మారి వేరే తల్లి బిడ్డను అత్యంత కిరాతకంగా చంపాక ఆ తల్లి తన కొడుకు అకృత్యాన్ని సమర్థిస్తుందా? అస్సలు సమర్థించదు. అందేకే తప్పు చేసిన తన కొడుకును ఉరి తీయమని చెబుతోంది. 

పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నారాయణ పేట మక్తల్ మండలంలోని జిక్లేరుకు చెందిన మహ్మద్ పాషా ఉన్నాడు. అతడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల నుంచి నా కొడుకు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వాడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత 3 గంటలకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. నా కొడుకు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయండి’ అని ఆమె తెలిపింది.