నా తనయుణ్ణి ఉరి తీయండి..శ్రీనివాస్‌రెడ్డి తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

నా తనయుణ్ణి ఉరి తీయండి..శ్రీనివాస్‌రెడ్డి తండ్రి

May 19, 2019

Hang my son says srinivasa reddy father bal reddy.

హాజిపుర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసి పోలీస్ కస్టడీలో ఉన్న సైకో శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని తన తండ్రి బాల్‌రెడ్డి కోరడం సంచలనం అవుతోంది. తమతో సాధారణంగా ఉండే తన చిన్నకొడుకు ఇంత ఘోరం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కర్నూలులో ఉన్నపుడు ఓ కేసు నుంచి తన పెద్దకొడుకు సుధాకర్‌రెడ్డి, తాను వెళ్లి విడిపించామన్నారు.

శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రావణి హత్య జరిగిన రోజు గ్రామంలోని బావి వద్ద వెదుకుతుంటే తామిద్దరం అక్కడే ఉన్నామని.. అప్పుడు అతని మొహంలో ఎలాంటి భయం కనపడలేదన్నారు. పోలీసులు తనను, తన తండ్రిని కస్టడీలో ఉంచిన సమయంలో పోచంపల్లి సమీపంలోని రావిరాలలో తమ బంధువుల ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని తానే పట్టించానని వెల్లడించారు. ఉరిశిక్ష కంటే పెద్ద శిక్షను తన తమ్ముడికి విధించాలని సుధాకర్‌రెడ్డి కోరాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఉరి తీయాలని గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.