Home > క్రైమ్ > ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

vcbfgn.

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విషాధం చోటు చేసుకుంది. ఓయూ ఆంగ్ల భాష విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థి గుగులోతు రవీందర్ నాయక్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. నేడు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బోడుప్పల్, ద్వారక నగర్ కాలనీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది తెలియరాలేదు. మృతుడి స్వస్థలం మహబుబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, తాళ్లఊకల్ గ్రామం. కాగా, రవీందర్ మృతదేహం ప్రస్తుతానికి బోడుప్పల్‌లోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న ఓయూ గిరిజన విద్యార్థులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Updated : 18 May 2020 11:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top