Hansika is marrying her friend's ex-husband
mictv telugu

షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్ మాజీ భర్తనే పెళ్లాడుతున్న హన్సిక.. వీడియో వైరల్

November 4, 2022

దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హన్సిక ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సొహైల్ ఖతురియా అనే ముంబై వ్యాపార వేత్తతో జైపూర్లో డిసెంబర్ 4న వివాహం చేసుకోనుంది. అంతకు ముందు హల్దీ, సంగీత్ వేడుకలు ఉంటాయని సమాచారం. దేశ ముదురు సినిమాతో హీరోయిన అయిన 31 ఏళ్ల హన్సికకు కాబోయే వరుడి గురించి షాకింగ్ విషయం వెలుగు చూసింది. వరుడు సొహైల్‌కి 2016లోనే పెళ్ళయిపోయందని చెప్పే వీడియో ఒకటి బయటపడింది. అతను పెళ్లాడింది ఎవరినో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ రింకూని. వారి పెళ్లి ట్రైలర్ వీడియోలో హన్సిక కూడా ఉంది. గోవాలో జరిగిన ఈ పెళ్లిలో హన్సిక ఆడిపాడి ఎంజాయ్ చేసింది. అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ రింకూ, సొహైల్ విడిపోయారు. ఆ సొహైల్‌నే ఇప్పుడు హన్సిక పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో హన్సికే చెప్పాలి. హన్సిక పెళ్లి వార్త రాగానే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.