Hansika motvani introduced fiancé
mictv telugu

హన్సిక కాబోయే భర్త ఇతడే..

November 2, 2022

‘దేశముదురు’ సినిమాలో తెలుగువాళ్లకు దగ్గరైన హన్సిక మోత్వానీ ఎన్నో హిట్లతో స్టార్ హీరోయిన్ అనిపించుకునంది. కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ సత్తా చాటి ఇక చాల్లే అని లైఫ్ సెటిల్ చేసుకుంటోంది. తన కాబోయే భర్తను తాజా పరిచయం చేసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద అతడు ఉంగరంతో ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్లు తీయించుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ముంబైలోని సింధీల కుటుంబంలో జన్మించిన హన్సిక బాల్యంలో తెరంగేట్రం చేసింది. అవకాశాలు లేకే పెళ్లిబాట పట్టినట్లు టాక్. కంత్రి, బిల్లా, కందిరీగ, మస్కా, పవర్, దేనికైనా రెఢీ వంటి హిట్లు అందించిన హన్సికకు అభిమానులు హ్యాపీ మేరీడ్ లైఫ్ అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమ పెళ్లి డిసెంబర్ 4 న జైపూర్‌లోని ఓ పాత రాజభవనంలో జరగనుంది. సొహైల్ కతారియా అనే వ్యాపారిని ఆమె పెళ్లాడనుంది. అతడు హన్సికకు చిన్ననాటి స్నేహితుడని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇటీవలే బౌద్ధమతం పుచ్చుకుంది.