Hansika Motwani wears red sari for 'Mata Ki Chowki' ahead of her wedding with Sohael Khaturiya
mictv telugu

మోగిన హాన్సిక పెళ్లి బాజా.. స్నేహితురాలి మాజీ భర్తే వరుడు

November 23, 2022

హీరోయిన్ హన్సిక పెళ్లి పనులు మొదలయ్యాయి. మరో పది రోజుల్ల పెళ్లి తంతు జరగనుండగా.. అందుకు సంబంధించిన కార్యక్రమాలు.. నిన్న సాయంత్రం నుంచే వధూవరుల కుటుంబాల్లో ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ముంబయిలోని నటి నివాసంలో ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు.

ఇక హన్సిక పెళ్లాడబోయే వరుడు ప్రముఖ వ్యాపారి సొహైల్ ఖతురియా. హన్సిక – సోహైల్‌ ఎంతోకాలం నుంచి మిత్రులు. ఆమెకు సంబంధించిన వ్యాపారంలోనూ అతడు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. అభిరుచులు కలవడంతో ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్‌ 4న వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్‌, జైపుర్‌లోని ఓ రాజకోట ఇందుకు వేదిక కానుంది. మరోవైపు, సోహైల్‌కు 2016లోనే వివాహమైంది. హన్సిక స్నేహితురాలు రింకీని ఆయన వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. వారి పెళ్లి ట్రైలర్ వీడియోలో హన్సిక కూడా ఉంది. గోవాలో జరిగిన ఈ పెళ్లిలో హన్సిక ఆడిపాడి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు హన్సిక అతడినే పెళ్లి చేసుకోబోతుంది. కాబోయే భర్తను ఆలింగనం చేసుకున్న ఆమె ఆనందంతో మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.