చైనాలో హంటా వైరస్.. భయం వద్దంటున్న వైద్యులు  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో హంటా వైరస్.. భయం వద్దంటున్న వైద్యులు 

March 25, 2020

Hantavirus in Chinna  

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని కారణంగా చైనా రెండు నెలల పాటు అతలాకులమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త వచ్చింది. కొత్తగా హంటా వైరస్ బయటకు వచ్చింది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ కూడా కరోనా వలే ఇబ్బందులు తెచ్చిపెడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది  కూడా చైనాలోనే బయటపడటంతో వారికి అనుమానాలను పెంచింది. 

కానీ హంటా వైరస్ కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. దీనికి కావాల్సిన ముందును 2016లోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారని అంటున్నారు. ప్రజలెవరూ కంగారు పడాల్సిన పని లేదంటున్నారు. ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా ఈ వ్యాధి వస్తుందని అంటున్నారు. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.