హనుమాన్ జయంతి.. చిరంజీవి స్పెషల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

హనుమాన్ జయంతి.. చిరంజీవి స్పెషల్ వీడియో

April 16, 2022

4

హనుమాన్ జయంతి సందర్భంగా మెగస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సిద్ధ పాత్ర కోసం చరణ్ తన కాటేజీలో సిద్ధమవుతోన్న వేళ అక్కడికి ఓ వానరం వచ్చింది. దాన్ని గమనించిన చరణ్ తన వద్ద ఉన్న బిస్కెట్స్‌ని దానికి అందించారు. వానరం ఆ బిస్కెట్‌ను తింటూ అక్కడే కూర్చొంది. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేస్తూ, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

 

మరోపక్క మెగస్టార్ చిరంజీవి ఆంజనేయుడికి పరమ భక్తుడని అందరికీ తెలిసిన విషయమే. శనివారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆచార్య’ లొకేషన్స్‌లోని కొన్ని అపురూప దృశ్యాలను ఆయన ఈ వీడియోలో పొందుపరిచారు. దేవాలయాలు, వాటిలో జరుగుతోన్న అవినీతి కథాంశంతో రూపుదిద్దుకున్న ‘ఆచార్య’ షూట్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్‌పై ఆయా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.