ఏపీలో మరో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం

September 25, 2020

Hanuman Statue Damaged in Nellore

ఏపీలో హిందూ  దేవాలయాలు, విగ్రహాలపై దాడులు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. దుండగులు నిత్యం ఏదో ఒక చోట విధ్వంసం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. 

నాయుడుపేట సమీపంలోని తుమ్మూరు ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 10 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం తల, తోక భాగాన్ని ధ్వంసం చేశారు. ఎన్ని దాడులు జరుగుతున్నా సరైన చర్యలు లేవని హిందూ సంఘాలు ఆరోపించారు. దీనిపై డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తీసుకువచ్చి దుండగుల కోసం గాలిస్తున్నారు.