‘ హనీబీ 2 ’ కిర్ కిరీ ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ హనీబీ 2 ’ కిర్ కిరీ !

July 25, 2017

మళయాల దర్శకుడు జీన్ పాల్ లాల్, నటుడు శ్రీనాథ్ భాసి పై ఒక నటి కోర్టులో అపీల్ దాఖలు చేసింది. ‘ హనీ బీ 2 ’ సినిమాలో తొలుత ఆమెకు ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకపోవడం వల్లే ఆ నటి కోర్టులో కేసు వేసిందట. సినిమాకు ముందు ఆ నటికి ఒప్పుకున్న మొత్తాన్ని ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొంది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నానని చెప్తోంది. నాకు బాకీ వున్న మొత్తాన్ని ఇవ్వవలసిందిగా వాళ్లున్న హోటల్ కు వెళితే దర్శకుడు జీన్ పాల్ లాల్, నటుడు శ్రీనాథ్ భాసి సహా ఇంకా ఇద్దరు తన పట్ల అసభ్యంగా మాట్లాడారని పేర్కొంది. అయితే దర్శకుడు మాత్రం ఆమె వల్ల మేమనుకున్న బడ్జెట్ కు చాలా ఎక్కువైంది. ఆమె నటించిన సీన్లను తొలగించి వేరే నటిని తీస్కొని రీషూట్లు చెయ్యాల్సి వచ్చిందని, దానివల్ల మాకు బడ్జెట్ రెండింతలు పెరిగిపోయింది. నటిగా ఒక సంస్థకు లాస్ కలిగించడం మంచి పద్ధతి కాదని డైరెక్టర్ వివరణ ఇస్తున్నాడు. అయితే ఆ నటి ఎవరన్నది గోప్యంగా వుండింది.

pithttps://scroll.in/latest/844966/director-jean-paul-lal-actor-sreenath-bhasi-booked-for-allegedly-making-lewd-remarks-to-a-womanition