హ్యాపీ బర్త్ డే ‘ జియో ’ - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాపీ బర్త్ డే ‘ జియో ’

September 5, 2017

రిలయన్స్ ‘ జియో ’ మంగళవారం మొదటి పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్నది. జియో 4G సేవలను ప్రారంభించింది సరిగ్గా గతేడాదే. సెప్టెంబర్ 5, 2016 న వాణిజ్యపరంగా తన సేవలను ప్రారంభించింది. డిసెంబరు 27, 2015 న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి. ఈ సందర్భంగా జియో మొదటి బీటా ప్రయోగం జరిగింది.  రిలయన్స్ జియో రావడం రావడమే దేశంలో టెలికాం పరిశ్రమలో పెద్ద సంచలనం.  వివిధ నెట్ వర్కుల మీద తన ప్రతాపాన్నీ, ప్రభావాన్ని చూపగలిగింది. ఈ ఫోన్ లాంచ్ తో వివిధ కంపెనీల ఫోన్లు 4G లుగా మారాయి. జియో తీసుకునే నిర్ణయాలు ఇతర టెలికాం కంపెనీలకు తలపోటుగా మారాయి.  ఉచితంగా సిమ్ కార్డులిచ్చి ఆర్నెల్ల వరకు ఉచిత కాల్స్, ఉచిత ఇంటర్ నెట్ సేవలను అందించిన ఘనత జయోది. జియో తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని కబుర్లు..

– జియో ప్రపంచంలోనే అన్ని ఐపీ నెట్ వర్క్ లకు చాలా భిన్నమైన నెట్ వర్క్. 800MHz, 1800MHz మరియు 2300MHz బ్యాండ్లు, మరియు అతిపెద్ద ఫైబర్, అన్ని IP నెట్ వర్క్, LTE స్పెక్ట్రమ్ ద్వారా 100,000 సైట్లతో ఏ ఇతర టెలికాం సంస్థల కన్నా భారతదేశంలోనే విశాలమైన LTE కవరేజ్ దీనికి ఉంది. భారతదేశ జనాభాలో 99 శాతం కవర్ చేయడానికి జియో నెట్ వర్క్ సిద్ధంగా వుంది. Jio తో, భారతదేశంలోనే గత 25 ఏళ్లలో 2G నుండి ఒకేసారి 4G వెలుగులు విరజిమ్మిన ఘనత జియోకు మాత్రమే దక్కుతుంది.

– భారతదేశంలో మొబైల్ డేటా వినియోగం నెలకు 20 కోట్లకు చేరింది. అందులో నెలకు 150 లక్షల గ్రామాల వరకు కేవలం జియో వినియోగదారులే. అంటే 125 కోట్లను గరిష్టంగా వినియోగిస్తున్నారన్నమాట.

– మొబైల్ డేటా వినియోగపరంగా మన దేశంలో జియో ప్రపంచంలోనే 155 నుండి నంబర్ వన్ ప్లేసుకు కదులుతోంది.

– జియో ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ఏకైక ఎక్సాబిట్ టెలికాం నెట్ వర్క్. నెలకు 100 కోట్ల కంటే ఎక్కువ GB డేటా కలదు. భారతదేశంలో అన్ని ఇతర టెలికాం సర్వీసులతో పోలిస్తే జియో ఇప్పటికే ఐదు రెట్ల ఎక్కువ డేటాను అధిగమించింది.

– నెలకు 165 కోట్ల గంటలు గరిష్టంగా స్ట్రీమింగ్ వీడియోలను అందిస్తోంది.

– వాయిస్ ట్రాఫిక్ రోజుకు 250 కోట్ల నిమిషాలు.

– తొలుత కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ల వినియోగదారులకు చేరింది.  చేరిన ప్రతి సెకనుకు ఏడుగురు వినియోగదారులను జత చేసింది. ప్రస్తుతం జియో నెట్ వర్క్ లో 130 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

– జియో వినియోగదారులకు ప్రస్తుతం నెలకు రూ. 399 లకు రోజుకు 1 GB స్పీడ్ డేటాను 84 రోజులు అందిస్తోంది.

– 31 ఆగస్టు 2016 నాటికి మొత్తం వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ చందాదారులు 154 మిలియన్లు. జియో పోస్ట్ పెయిడ్  చందాదారుల సంఖ్య కూడా విశేషంగా పెరిగింది. అలాగే TRAI డేటా ప్రకారం వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ చందాదారుల సంఖ్య 30 జూన్ 2017 నాటికి 282 మిలియన్లకు పైగా పెరిగింది.

– ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ఇతర అన్నీ ముఖ్యమైన సోషల్ మీడియా అప్లికేషన్లు మరియు కంటెంట్ ప్రొవైడర్లు భారతదేశంలో మెరుగైన యూజర్ బేస్ ను జియోనే అందించింది. గూగుల్, ఫేస్బుక్ కోసం భారతదేశం అత్యంత క్రియాశీల మార్కెట్ గా మారింది. అంతే కాకుండా మొదటి రోజున ఆరు మిలియన్ యూనిట్ల వరకు జియో ఫోన్లను అమ్మారు. .

జియో మార్కెట్లోకి రావడం రావడంతోనే తక్కువ మొత్తాల్లో ఎక్కువ టాక్ టైంను, డేటాను ఇచ్చి సాధారణ మనుషులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు తల బిరుసు తనంగా వ్యవహరించిన వివిధ నెట్ వర్కులకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. ముందు ముందు జియో ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్ఖర్లేదు.