వాలెంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే రానే వచ్చింది. ఈ వీక్‌లో మూడవ రోజును చాక్లెట్ డే అని పిలుస్తారు. మామూలు రోజుల్లోనే నచ్చిన వ్యక్తికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను తెలియజేస్తారు.. ప్రేమలో పీకల్లోతు మునిగిన వాళ్లు. కుర్రాళ్లయితే తమ ప్రేయసి వారిపై అలకతో ఉన్నా.. కోపంగా ఉన్నా.. వారిని కూల్ చేసేందుకు జేబుల్లో డజన్ల కొద్దీ రెడీగా చాక్లెట్లు నింపుకుని తిరుగుతుంటారు. అదే ఈ చాక్లెట్లకి కూడా ఓ స్పెషల్ డే ఉండి.. అందులోనూ వాలెంటైన్స్ స్పెషల్ అయితే.. వారి ప్రేమ ఎంత మధురమయంగా మారుతుందో చెప్పక్కర్లేదు.
చాలామంది యువకులు.. తమ మనసుకి నచ్చిన ప్రేయసికి చాక్లెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే వారికి కేవలం చాక్లెట్ మాత్రమే ఇవ్వకుండా.. ఓ గ్రీటింగ్ కార్డు లేదంటే ఓ రోజ్ ఫ్లవర్ ఇస్తూ.. మీ మనస్సులోని స్వచ్ఛమైన ప్రేమను వారికి తెలియజేయండి. నిజమైన సంతోషం.. నిజమైన ప్రేమలోనే దొరుకుతుంది. ఆ నిజమైన ప్రేమకు ఈ చాక్లెట్ ప్రతిరూపంగా నిలుస్తుంది. మీరు ప్రేమించిన వారి నోరు తీపి చేస్తూ, భవిష్యత్తు అంతా ఇంతే తియ్యగా ఉండేలా చూసుకుంటానని ప్రామిస్ చేయండి.
ప్రేమికులన్నాక అలకలు, కోపాలు సర్వసాధారణం . లవర్ కోపాన్ని కూల్ చేయడానికి చాక్లెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ప్రేమలో ఉండి ఉంటే.. మీ లవర్ మీపై ఏదో కారణంతో అలిగి ఉంటే వారికి ఒక చాక్లెట్ ఇచ్చి కూల్ చేయండి. స్వచ్ఛమైన ప్రేమకు ఎవరైనా కరిగిపోతారు. అది చాక్లెట్ ఇచ్చి మీ ప్రేమను చూపిస్తే కచ్చితంగా కరిగి తీరుతారు. చేతిలో చాక్లెట్ పట్టుకుంటే కలిగే ఆనందం.. మీరు ప్రేమించిన వారిలోనూ చూడొచ్చు. ఈ చాక్లెట్ డేని తీపితో పాటు ఆనందం కలుపుకుని ఆస్వాదించండి. ఇక మార్కెట్ లో కూడా ఈ రోజు లవ్ షేప్స్‌తో ఉన్న చాక్లెట్లను ఈ చాక్లెట్ డే కోసమే స్పెషల్‌గా తయారు చేస్తారు. అలాంటి చాక్లెట్ ఇచ్చి మీకు ఇష్టమైన వారిని విష్ చెయండి.