ప్రేమ వారంలో టెడ్డీ డేకి వచ్చేశాం. మీ ప్రియమైన వారికి టెడ్డీ బేర్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. అయితే ప్రేమను పంచే ఈ మెత్తని బొమ్మ రంగులో కూడా రహస్య సందేశం దాగి ఉందని తెలుసా?
ప్రేమను ఎలాగైనా తెలుపవచ్చు. అయితే ఎప్పటికీ ప్రేమిస్తానని, సంతోషాన్ని సూచించేందుకు టెడ్డీని బహుమతిగా ఇస్తే ప్రేమించేవాళ్లు సంతోషిస్తారు. వివిధ రంగుల్లో ఉన్న టెడ్డీ బేర్ లకు ప్రత్యేకమైన అర్థాలున్నాయి.
పింక్ టెడ్డీ :
క్రష్ మిమ్మల్ని ఇష్టపడుతుందో, లేదో తెలుసుకోవాలంటే టెడ్డీ బేర్ ఇవ్వండి. అది తీసుకుంటే మీ ప్రేమను అంగీకరించినట్టే! పింక్ రంగు.. కరుణ, సంరక్షణ, ప్రేమ, ఆరాధనను సూచిస్తుంది. మీ స్నేహాన్ని ప్రేమగా మార్చుకోవాలనుకుంటే.. మీరు పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇవ్వండి.
రెడ్ టెడ్డీ :
ఎరుపు గులాబీలాగే.. ఎరుపు టెడ్డీ బేర్ ప్రేమను సూచిస్తుంది. ఎరుపు రంగు.. నిజమైన ప్రేమ, అభిరుచి, శృంగారం, సంకల్పం సూచిస్తుంది. మీరు ఒక వ్యక్తికి టెడ్డీ బేర్ ని ఇచ్చినప్పుడు.. ఆ వ్యక్తి పట్ల మీకు ఎలా అనిపిస్తుందో తెలిసిపోతుంది. ఎరుపు రంగు టెడ్డీని ఇవ్వడం మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారని చూపిస్తుంది.
ఆరెంజ్ టెడ్డీ :
ఈ టెడ్డీ బేర్.. ఆనందం, ఆశను తెలుపుతుంది. మీ ప్రియమైన వారికి ప్రపంచంలో సంతోషం కలుగాలని కోరుకోవడానికి ఒక అందమైన చిన్న ఆరెంజ్ టెడ్డీ బేర్ ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రంగు కూడా ఆనందం, ఆకర్షణ, ఉత్సాహానికి చిహ్నాం. ఎవరైనా మీకు ఆరెంజ్ టెడ్డీని ఇస్తే మీకు ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అని అర్థం.
వైట్ టెడ్డీ :
తెల్లని టెడ్డీ ఒక ప్రత్యేకమైన సందేశం ఇస్తుంది. ఎవరైనా.. ముఖ్యంగా క్రష్ వైట్ టెడ్డీని అందిస్తే వారు ఇప్పటికే బుక్ చేసుకున్నారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. కొన్నిసార్లు వేరే రంగు టెడ్డీలు దొరకకపోతే వాటినే ఇస్తాం. కానీ మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పాకనే ఈ రంగు టెడ్డీని బహుమతిగా ఇవ్వండి. తెలుపు.. స్వచ్ఛత, సానుకూలత, అందం, సామరస్యంతో ముడిపడి ఉంటుంది.
బ్లూ టెడ్డీ :
ఈ రంగు టెడ్డీ చాలా అందంగా ఉంటుంది. ఈ రంగు తెలివి, నిజాయితీ, విధేయత, స్థిరత్వం, విశ్వాసాన్ని సూచిస్తుంది. మీరు మీ సంబంధానికి కట్టుబడి ఉన్నారని అర్థం. మీ భాగస్వామితో కలిసి నడవడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
గ్రీన్ టెడ్డీ :
ఈ టెడ్డీ బేర్ అంటే.. మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం వేచి ఉండడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఏది ఏమైనా.. మీరు ఎల్లప్పుడూ ప్రేమ, సహనం, సంబంధం పట్ల నిబద్ధతతో మీ ప్రియమైన వారికోసం వేచి ఉంటారు.
మరి మీరు ఏ టెడ్డీ ఇవ్వాలనుకున్నారో డిసైడ్ అయ్యారా?!