తెలంగాణ నిరుపేదలకు శుభవార్త
తెలంగాణలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర నిరుపేదలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గృహ నిర్మాణానికి సంబంధించి హరీశ్ రావు వెల్లడించిన ముఖ్యాంశాలు
1. సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.
2. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం.
3. సొంతస్థలం ఉన్న 4 లక్షల మందికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం.
4. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల కేటాయింపులు.
5. ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు.
6. నిర్వాసితులకు, ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయింపు.
7. సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు ఇండ్ల కేటాయింపులు చేస్తాం అని హరీశ్ రావు అన్నారు.
అంతేకాకుండా మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణ పేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాల పట్ల చిన్నచూపు చూస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అడిగినా కేంద్రం ఇవ్వలేదు. 7 రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తాం. వచ్చే ఆర్థిక ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ అవుతుంది అని స్పష్టం చేశారు.