భార్యాబాధితుల అక్కసు.. శూర్పనఖ దహనం - MicTv.in - Telugu News
mictv telugu

భార్యాబాధితుల అక్కసు.. శూర్పనఖ దహనం

October 20, 2018

దసరా పండుగ రోజు రావణాసుర వధ జరగడం ఆనవాయితి. అందుకే దేశమంత రావణుడి విగ్రహాలను దహనం చేస్తారు. చెడుపై మంచి విజయంగా విజయదశమి జరుపుకుంటాం. కానీ ఈ దసరాకు మహారాష్ట్రలో మాత్రం వెరైటీగా రావణాసురిడి సోదరి శూర్పనఖ బొమ్మను దహనం చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది ఆచారం కాదు.. భార్య బాధితుల సంఘానికి చెందినవారు భర్యలను శూర్పణకతో పోల్చుతూ.. వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.'Harassed' Husbands Burn Effigy Of Ravana's Sister Surpanakha On Dussehra Aurangabad in Maharashtraభార్య బాధితుల సంఘం సభకు చెందిన సభ్యులు ఔరంగాబాద్ సమీపంలోని కరోలి గ్రామంలో శూర్పణక దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పత్ని పీడిత్ పురుష్ సంఘటన్ వ్యవస్థాపకుడు భరత్ పులరే మాట్లాడుతూ.. ‘మా భార్యలు మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. మన దేశంలో చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాం. వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. భార్యల వేధింపులకు గుర్తుగా మేము ఈ రోజు ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను దహనం చేశాం’ అని తెలిపారు.