హర్భజన్‌కు రూ. 4 కోట్ల టోపీ పెట్టిన వ్యాపారి..  - MicTv.in - Telugu News
mictv telugu

హర్భజన్‌కు రూ. 4 కోట్ల టోపీ పెట్టిన వ్యాపారి.. 

September 10, 2020

భారత క్రికెటర్ హర్బజన్ సింగ్‌కు ఓ వ్యాపారి రూ.4 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో భజ్జీ చైన్నై పోలీసులను ఆశ్రయించాడు. హర్బజన్‌ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త 2015లో పరిచయం అయ్యాడు. స్నేహితుడి స్నేహితుడే అవడంతో భజ్జీ అతన్ని నమ్మాడు. అవసరానికి అతనికి రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పు తీసుకున్నవాడు తిరిగి చెల్లించడంలో తత్సారం చేశాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ అతన్ని చాలాసార్లు అడిగాడు. 

గత ఆగస్టులో భజ్జీ పేరు మీద మహేష్‌ రూ.25 లక్షల చెక్కును పంపించాడు. అయితే అది బౌన్స్‌ అయింది. అప్పటినుంచి డబ్బులు ఇవ్వకుండా మహేష్ తప్పించుకు తిరుగడం ప్రారంభించాడు. దీంతో గురువారం హర్భజన్‌ తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా, వ్యక్తిగత కారణాలతో భజ్జీ ఈ ఏడాది ఐపీఎల్ 2020‌ ఆడటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.