హర్భజన్‌కు కరెంట్ షాక్.. వీధిలో అందరిదీ నాకేనా? - MicTv.in - Telugu News
mictv telugu

 హర్భజన్‌కు కరెంట్ షాక్.. వీధిలో అందరిదీ నాకేనా?

July 27, 2020

Harbhajan Singh 'shocked' by electricity bill, questions Adani Power.

క్రికెటర్ హార్బజన్ సింగ్‌కు కూడా కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. ముప్ఫై వేల పైన వచ్చిన బిల్లును చూసి ఆయన ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. తమ ఏరియాలో ఉన్న అందరి కరెంట్ బిల్లు తనొక్కడికే పంపించారా? అని ప్రశ్నించాడు. రెగ్యులర్‌గా వచ్చే కరెంట్ బిల్లు కంటే ఏడు రెట్లు ఎక్కువగా బిల్లు వేశారని గుర్రుమన్నాడు. ఈ మేరకు హార్బజన్ అదానీ ఎలక్ట్రిసిటీ హ్యాష్‌ట్యాగ్‌ని జత చేస్తూ ట్వీట్ చేశాడు. కరోనా సమయంలో హర్భజన్‌కు ఈ నెల కరెంట్ బిల్లు రూ. 33,900 వచ్చింది. వచ్చే నెల 17వ తేదీలోగా బిల్లు కట్టాలని పేర్కొన్నారు. దీంతో షాక్ అయిన హార్బజన్ ట్వీట్ చేశాడు.

కరోనాతో జనాలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని.. భారీ కరెంట్ బిల్లులతో విద్యుత్ సంస్థలు జనాలను మరింత కష్టపెడుతున్నాయని ఆరోపించాడు. కాగా, కరోనా కష్ట సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కరెంట్ బిల్లులు వస్తున్న విషయం తెలిసిందే. కొందరికి లక్షల్లో, కోట్లలో కూడా బిల్లులు వచ్చాయి. దీంతో విద్యుత్ సంస్థలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బాలీవుడ్‌ నటి తాప్సీకి సైతం ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఎవరూ ఉండని తన పాత ఇంటికి రూ.36 వేలు బిల్లు వచ్చిందని తెలిపింది.