టీ 20-2022 వరల్డ్ కప్ ఓటమి తర్వాత బీసీసీఐ మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. వచ్చే టీ20 వరల్డ్ కప్ (2024) లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్లను తప్పించి యువకులకు పెద్దపీట వేసింది. కెప్టన్ హార్దిక్ పాండ్యాను నియమించింది. ఈ రానున్న కాలంలో కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగించాలని బీసీసీఐ ఆలోచనలో ఉంది.
2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ భారత్‌కు అందని ద్రాక్షలా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లో అదరగొడుతున్నా..ప్రపంచకప్ లలో మాత్రం ఆటగాళ్ళు తేలిపోతున్నారు. 2022లో రోహిత్ సేన వరల్డ్ కప్ వైపు అడుగులు వేసినా సెమీస్‌లో ఇంగ్లాండ్ పై దారుణంగా ఓడిపోయింది. దీంతో టీ20 జట్టులో మార్పులను చేసింది బీసీసీఐ.
ఈ నేపథ్యంలో భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భారత్ జట్టుకు కీలక సూచనలు చేశాడు. టీ20లకు వేరే కెప్టెన్‌ను నియమించినట్టుగానే కొత్త కోచ్‌ను నియమించుకోవాలని సూచించాడు. అలా ఐతే జట్టు తడబడకుండా ఉంటుందని చెప్పాడు. “టీం ఇండియా ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు. జట్టుకు ఇద్దరు కెప్టెన్లుఉన్నారు. అలాగే టీ20, వన్డే, టెస్ట్ ఫార్మెట్లకు కూడా ఇద్దరు కెప్టెన్లు నియమించుకోవచ్చు. వన్డే, టెస్టుల్లో టీంఇండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు ద్రవిడ్ వద్ద ఉన్నాయి. టీ20ల కోసం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాతో ప్రయోగం చేయొచ్చు. నెహ్రా శిక్షణలో హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా పనిచేసి విజయం సాధించాడు. జట్టు అవసరాలను గుర్తించి వారిని కోచ్‌గా నియమించండి” అని హర్భజన్ సింగ్ తెలిపాడు. హర్భజన్ సింగ్ సూచనలను బీసీసీఐ ఎలా తీసుకుంటాదో చూడాలి.