ర్యాపర్‌ను బ్యాన్ చేసిన ట్విటర్.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ర్యాపర్‌ను బ్యాన్ చేసిన ట్విటర్.. ఎందుకంటే..

August 13, 2019

PM Narendra.

ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్రమంత్రి అమిత్ షాపై పాటరూపంలో అసభ్యకర పదజాలంతో దూషించిన పంజాబీ ర్యాపర్  హర్ద్‌కౌర్ ట్విటర్‌ను ట్విటర్ బ్యాన్ చేసింది. దేశం నుంచి వేరుపడాలనుకుంటున్న ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి ఓ పాటను రూపొందించింది హర్ద్‌కౌర్. మోదీ, అమిత్ షాలకు సవాలు విసురుతూ వారిపై అసభ్యకరంగా కామెంట్స్ చేసింది. దీనిపై ట్విటర్ స్పందించింది. హర్గ్‌కౌర్ ట్విటర్ అకౌంట్‌ను బ్యాన్ చేసింది.

గతంలో హార్ద్‌కౌర్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్య నాథ్‌పైన కూడా కామెంట్స్ చేసింది. యోగిని ‘రేప్‌మెన్’ అని పిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌ను కూడా ఉగ్రవాదిగా విమర్శించింది. దీంతో హర్ద్‌కౌర్‌పై దేశద్రోహంతో పాటు పలు కేసులు నమోదయ్యాయి.