ఎయిర్ ఇండియా విమాన సేవలపై పార్లమెంట్లో ఆసక్తికర చర్చ జరిగింది. విపక్షాలు చేస్తున్న వాదనను కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. ఇప్పటికైనా ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే దాన్ని పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని ఆయన రాజ్యసభలో విపక్షాల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రైవేటీకరణ చేయకపోతే దాన్ని నడిపేందుకు నిధులు ఎక్కడి నుంచి తేవాలని విపక్షాలను ప్రశ్నించారు. ఈ సంస్థ ప్రభుత్వానికి మెరుగైనా ఆస్తి అని అన్నారు. దీన్ని విక్రయించాలనుకుంటే మెరుగైన బిడ్డరు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఇంకా పాత పద్దతలు,సిద్ధాంతాల పట్టుకొని కట్టుకుని కూర్చుంటే ఆ సంస్థ మనుగడ కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. అన్నిటికంటే ప్రైవేటీకరణ ఉత్తమ మార్గమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థను నడిపించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.