పబ్‌లో ధోని, హార్దిక్ పాండ్యా రచ్చ..రచ్చ... - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌లో ధోని, హార్దిక్ పాండ్యా రచ్చ..రచ్చ…

November 27, 2022

మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌ను వీడి రెండు సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయినా అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ధోనికి సంబంధించి ఏ వార్తైన అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. అప్పుడప్పుడు ధోని వీడియోలు సోషల్ మీడియాలో చూసి మురిసిపోతుంటారు. తాజాగా ధోని.. పబ్‌లో రచ్చలేపిన వీడియో వైరల్ అవుతుంది. పాండ్య బ్రదర్స్‎తో చేసిన డ్యాన్స్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది. ఇక ధోనీ డ్యాన్స్‌ను చూసి అతని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

దుబాయ్ లో జరిగిన ఓ స్నేహితుడి బర్త్ డే వేడుకకు ధోని హాజరయ్యాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్ బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌లో స్టెప్పులేశాడు. ర్యాపర్ బాద్‌షా పాట పాడుతుంటే వెనక్కు కోరస్ ఇస్తూ ఉత్సాహంగా స్టెప్పులతో ఇరగదీశారు. ఈ వీడియో తీసిన మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్టు చేసింది.


రాబోయే ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్‌గా ధోని మ‌రోసారి బ‌రిలోకి దిగనున్నాడు.ఈ ఐపీఎల్ ధోనికి చివరిదిగా భావిస్తున్నారు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని గుడ్ బై చెప్తాడని వార్తలు వస్తున్నాయి. ధోని కూడి దీనిపై ఇప్పటిక ఓ క్లారిటీ ఇచ్చాడు. అయితే టీ20లో టీఇండియాకు ధోని సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. వచ్చే వరల్డ్‌కప్ కోసం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యతను ధోనికి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో 3 టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఉన్న‌ హార్ధిక్ పాండ్యా వ‌న్డే సిరీస్‌కు ఎంపిక కాని సంగతి తెలిసిందే..