హార్దిక్ ఖాతాలో మరో రికార్డు.. తొలి భారత ఆటగాడిగా గుర్తింపు - MicTv.in - Telugu News
mictv telugu

హార్దిక్ ఖాతాలో మరో రికార్డు.. తొలి భారత ఆటగాడిగా గుర్తింపు

August 3, 2022

టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును తన పేరును లిఖించుకున్నాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆడిన హార్దిక్.. పురుషుల టీ20లో టీమిండియా తరపున 500 పరుగులు, 50 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 30వ స్థానంలో, మెన్స్ క్రికెట్‌లో 11 వ స్థానంలో నిలిచాడు. అలాగే టీ20లో 50 వికెట్లు సాధించిన ఆరో ఆటగాడిగా స్థానం పొందాడు. ఇంతకుముందు ఇంగ్లాండుతో జరిగిన సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఒకే మ్యాచులో ఐదు వికెట్లు, 50 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా, మరో ఆల్‌రౌండర్ జడేజా కూడా వెస్టిండీస్‌తో మ్యాచులో టీ20లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరపున మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (65 వికెట్లు, 521 పరుగులు) సాధించి మొదటి స్థానం కైవసం చేసుకుంది.