అంబేడ్కర్‌పై ఆ కామెంట్ చేసింది పాండ్యా కాదు - MicTv.in - Telugu News
mictv telugu

అంబేడ్కర్‌పై ఆ కామెంట్ చేసింది పాండ్యా కాదు

March 22, 2018

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై ట్విటర్లో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై  పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాదాస్పద ట్వీట్ చేసింది పాండ్యా కాదని, అతని పేరుతో ఉన్న నకిలీ అకౌంట్ నుంచి వచ్చిందని తెలిసింది. ఈ ట్వీట్ గత ఏడాది డిసెంబర్ 26 వచ్చింది. అయితే హార్దిక్ అధికారిక ఖాతాలో అది లేదు.

‘‘ఏ అంబేద్క‌ర్‌? దేశంలో రిజ‌ర్వేష‌న్ల పేరుతో ఓ వ్యాధిని వ్యాప్తి చేసిన వ్యక్తా?’’ అని హిందీలో చేసిన ట్వీట్ @sirhardik3777 నుంచి అనే పేరడీ, నకిలీ వచ్చింది. పాండ్యా అధికారిక ట్విటర్ ఖాతా @hardikpandya7. అయితే తనపై వస్తున్న విమర్శలపై పాండ్యా స్పందించకపోవడంతో అందరూ ఆ ట్వీట్ చేసింది అతనే అని అనుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన లాయర్, రాష్ట్రీయ భీమ్ సేన్ సభ్యుడు మేఘ్‌వాల్ జోధ్‌పూర్ దీనిపై  కోర్టులో ఫిర్యాదు చేశాడు. స్పందించిన కోర్టు.. హార్దిక్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా, వివాదాస్పద ట్వీట్‌కు మూలమైన @sirhardik3777 ఖాతా ప్రస్తుతం కనిపించడం లేదు