హార్దిక్ పాండ్యా..ఐపీఎల్ ద్వారా టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి భారత్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎదిగిన ఆటగాడు. పొట్టి ఫార్మెట్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో జట్టు సారథ్య బాధ్యతలు భుజానికి ఎత్తుకొని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు.హార్దిక్ కెప్టెన్సీలోనే 2023లో శ్రీలంక, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లను భారత్ కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2022 సీజన్ లో తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు.
హార్దిక్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2020 మే 31న కొంత మంది సన్నిహితుల మధ్య నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహమాడాడు. పెళ్లి సమాయానికి అతడి భార్య ప్రెగ్నెంట్ కాగా తర్వాత వారికి అబ్బాయి జన్మించాడు. అయితే తాజాగా మరోసారి హార్దిక్ పెళ్లికి సిద్ధమవ్వడం చర్చనీయాంశమైంది. లవర్స్ డే (ఫిబ్రవరి 14) రోజునే మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నాడు ఈ ఆల్ రౌండర్. అయితే తన భార్యనే.. హార్దిక్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. కోవిడ్ సమయంలో వారి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. దీంతో మరోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయం తీసుకుంది.దీంతో ఫిబ్రవరి 13 నుంచి 16 మధ్య హార్దిక్-నటాషా వివాహం ఘనంగా జరగునుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పాటు హల్దీ, మెహెందీ,సంగీత్ లాంటి కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో వెడ్డింగ్ ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి.పెళ్లయిన మూడేళ్లకు మరోసారి ఈ జంట వివాహం చేసుకోవడం విశేషం.