తండ్రైన హార్దిక్ పాండ్యా.. పండంటి బాబుతో ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రైన హార్దిక్ పాండ్యా.. పండంటి బాబుతో ఇలా

July 30, 2020

Hardik Pandya blessed with baby boy

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. పెళ్లి కాకుండానే హార్దిక్, నటాషా స్టాన్‌కోవిచ్ లు తల్లిదండ్రులు అయ్యారు.‌ హార్దిక్‌, నటాషా జోడికి ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థం జరిగిన సంగతి తెల్సిందే. మే 31న తాము తల్లిదండ్రలు కాబోతున్న విషయాన్ని వారు వెల్లడించారు.

తాజాగా ఈరోజు నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హార్దిక్‌ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొడుకు చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తెగ సంబురపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారిని పాండ్య అభిమానులు జూనియర్ హార్దిక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌, హార్దిక్ సోదరుడు కృనాల్‌ పాండ్యా, టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి, సచిన్ కూతురు సారా టెండూల్కర్‌, బాలీవుడ్ నటి సోనాల్‌ చౌహాన్‌ తదితరులు హార్దిక్‌, నటాషా జంటకు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. 

View this post on Instagram

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on