భారత జట్టును విజయవంతంగా నడిపించిన నాయుకుడు ధోని. అతడి తర్వాత కోహ్లీ, అనంతరం రోహిత శర్మ..మరి రోహిత్ తర్వాత అంతటి స్థాయి ఆటగాడు, నడిపించే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు కరెక్టైన సమాధానం దొరకడం లేదు. అందరూ హార్దిక్ పాండ్యా వైపు చూపిస్తున్నా అతడి సామార్థ్యంపై కొందరికి అనుమానాలు ఉన్నాయి.
టీ 20లకు హార్దిక్ ఒకే అంటున్న..వన్డేల్లో రాణించగలడా అనే సందిగ్థం నెలకొంది. అయితే ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హార్దిక్‌కు పూర్తి మద్దతు పలికారు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ అప్పగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమ్‌ను చక్కగా నడిపించగలిగే సత్తా హార్దిక్‌లో ఉందని సునీల్ గవాస్కర్ తెలిపారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడిని టీమిండియా కెప్టెన్‌గా ప్రకటించాలని సూచించారు.
టీ20లో కెప్టెన్ గా ఉన్న హార్దిక్..టీమ్‌ను విజయపథంలో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. అతడి సారథ్యంలో ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌పై పొట్టి సిరీస్‌లో జట్టును విజేతగా నిలిపాడు. దీంతో వన్డే కెప్టెన్‌గా హార్దిక్‌కు అవకాశం ఇవ్వాలని మాజీల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.ఇక ముంబైలో జరగనున్న ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మార్చి 17న జరిగే తొలి వన్డేకు రోహిత్ దూరం కావడంతో పాండ్యాకు పగ్గాలు అప్పగించారు. గత ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిపాడు హార్దిక్.