hardik pandya clariy for ignoring Samson in New Zealand T20Is
mictv telugu

సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడానికి కారణమిదే..

November 23, 2022

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలో బరిలోకి దిగిన భారత్ 1-0తో సిరీస్‌ను దక్కించుకుంది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 రద్దవ్వగా, రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఇక మూడో టీ20 టైగా ముగిసింది.వరల్డ్ కప్ అనంతరం జరిగిన ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, అశ్విన్ వంటి దూరంగా ఉండడంతో కుర్రాళ్లకు అవకావం కల్పించారు. సంజూశాంసన్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్ వంటి వారు జట్టులో స్థానం దక్కించుకున్నారు.

అయితే తుది జట్టులో అవకాశం వస్తుందని భావించిన సంజూశాంసన్ పక్కనబెట్టడం, వరుసుగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను ఆడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజూకు అవకాశాలు కల్పించడం లేదని, సిరీస్‌లకు ఎంపిక చేసి బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని అభిమానులు మండిపడ్డారు. అతని టాలెంట్‌ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఉమ్రాన్ మాలిక్ కూడా అవకావం కల్పించాల్సిందని..యువఆటగాళ్లను పెద్దపీటవేయాలని డిమాండ్ చేశారు. మాజీ క్రికెటర్లు సైతం భారత మేనేజ్ మెంట్‎పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ లో విఫలమైన రిషభ్‌ పంత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ హుడాలకే మళ్లీ అవకాశాలు ఇచ్చి, సంజు శాంసన్‌ తో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి ప్లేయర్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదని చెబుతున్నారు.

ఈ విమర్శలపై టీఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. జట్టు ప్రణాళికల్లో భాగంగా పలువురు తుది జట్టులో ఆడలేకపోయారని స్పష్టం చేశాడు. సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడం దురదృష్టకరమని చెప్పాడు. వ్యూహాల్లో భాగంగానే అతనికి చోటులేకుండా పోయిందని తెలిపాడు. చోటుదక్కక అసంతృప్తిగా ఉన్న ప్లేయర్స్ తనతో వచ్చి మాట్లాడవచ్చని..అందుకు తన గది తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని పేర్కొన్నాడు.