ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి t20లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి బంతికి టీం ఇండియా విజయం దక్కించుకుంది. భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 160 పరుగులు చేసింది. చివరి ఓవర్ వేసిన అక్షర్ పటేల్ భారత్‌ను గట్టెక్కించాడు. ఆరు బంతులో శ్రీలంక 13 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం పది పరుగులు ఇచ్చాడు. అప్పటి వరకు భారత్‌ను రెండు సిక్సర్లతో భయపెట్టిన కరుణరత్నే అడ్డుకట్ట వేశాడు. చివరి ఓవర్‌కు ముందు వరకు రెండు ఓవర్లు వేసిన అక్షర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ తీయకుండా 21 పరుగులు ఇచ్చేశాడు. ఈ సమయంలో చివరి ఓవర్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా..అక్షర్‌కు బంతి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మ్యాచ్ ముగిశాక అక్షర్ పటేల్ చివరి ఓవర్ ఇవ్వడంపై హార్దిక్ క్లారిటీ ఇచ్చాడు. కఠిన పరిస్థితుల్లో జట్టును రాణించేవిధంగా తీర్చిదిద్దడానికే అక్షర్‌కు చివరి ఓవర్ ఇచ్చానని తెలిపాడు. మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు కానీ ఈ అనుభవం పెద్ద మ్యాచ్‌ల్లో ఉపయోగపడుతుందిన హార్దిక్ తెలిపాడు.
Surprised to see Axar bowling the final over? Here's Captain @hardikpandya7 revealing the reason behind the move. #INDvSL #TeamIndia @mastercardindia pic.twitter.com/dewHMr93Yi
— BCCI (@BCCI) January 3, 2023
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగాలు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి :
క్యాచ్ వదిలేసిన సంజూ.. కెప్టెన్ రియాక్షన్ వీడియో చూడాల్సిందే
భారత్ తరఫున ఫాస్టెస్ట్ బాల్ విసిరిన ఉమ్రాన్ మాలిక్.. శ్రీలంక కెప్టెన్ ఔట్!
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు