ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించగా..చేధనలో కేఎల్ రాహుల్, జడేజాను జట్టును గట్టెక్కించారు.మ్యాచ్ విషయాన్ని పక్కనబెడితే రోహిత్ గైర్హాజరుతో మొదటి వన్డేకు కెప్టెన్ వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తీరు మాత్రం చర్చనీయాంశమవుతోంది. అతడు సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సూచనలను పట్టించుకోపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ అభిమానులే కాదు, క్రికెట్ అభిమానులందరూ పాండ్యా ఓవర్ యాక్షన్ ను తిట్టిపోస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
21 ఓవరల్లో కుల్దీప్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ లో మార్పుల చేయాలని కోహ్లీ పాండ్యాకు సూచించాడు. అయితే వాటిని పాండ్యా పట్టించుకోలేదు. అంతేకాక కోహ్లీ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కోహ్లీ ఒక్కసారిగా ఆగ్రహాంతో ఊగిపోయాడు. పాండ్యావైపు చేయి చూపుతో ఆవేశంతో ఏదో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— CricAddaa (@cricadda) March 17, 2023
హార్దిక్ వ్యవహారశైలిపై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచ్ నెం.1 బ్యాటర్ కి ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించిన సీనియర్ ప్లేయర్‌కి విలువ ఇవ్వడం నేర్చుకోవాలని అభిమానులు పాండ్యాకు చురకలంటిస్తున్నారు. కెప్టెన్ అనే పొగరను తలకెక్కించుకోవద్దని సూచిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తించుకోవలన్నారు. ఇక విరాట్ అభిమానులు హార్దిక్‌పై ట్రోలింగ్ మొదలు పెట్టేశారు.
రాణించిన రాహుల్
వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది.189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గత కొంతకాలంగా ఫామ్ లోక తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (75 నాటౌట్: 91 బంతుల్లో 7×4, 1×6) అజేయ అర్థసెంచరీతో మ్యాచ్ ను గెలిపించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (45 నాటౌట్: 69 బంతుల్లో 5×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండ వన్డే విశాక వేదికగా ఈనెల 19న జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి.