బుల్లి పాండ్యా భలే ఉన్నాడోచ్.. దేవుడిచ్చిన కానుకంటూ..  - MicTv.in - Telugu News
mictv telugu

బుల్లి పాండ్యా భలే ఉన్నాడోచ్.. దేవుడిచ్చిన కానుకంటూ.. 

August 1, 2020

Hardik Pandya Shares Picture Of His Baby Boy

భారత క్రికెట్ జట్టు ల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పుత్రోత్సాహంలో మునిగి  తేలుతున్నాడు. ఆయన భార్య, సెర్బియా నటి నాటా స్టాంకోవిచ్ మొన్న పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పుట్టిన రోజున బాబు వేలు పట్టుకుని తీయించుకున్న ఫొటోను పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా వాడిని చేతిలోకి తీసుకున్న ఫొటోను పంచుకున్నాడు. దానికి ‘దేవుడిన కానుక’ అని క్యాప్షన్ పెట్టాడు. చిన్న పాండ్యా చాలా ముద్దొచ్చేలా ఉన్నాడని, అచ్చం తల్లి పోలికేనని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. 

26 ఏళ్ల పాండ్యా, నటాషా ఈ ఏడాది తొలి రోజున దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. మేనెలో పెళ్లాడారు. నటాషా గర్భంతో ఉన్న చిత్రాలను పాండ్యా పోస్ట్ చేసి శుభవార్త చెప్పాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత పాండ్యా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్నాడు. ప్ర్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు.