Hardik Pandya, Suryakumar Yadav meets Hero Ram Charan after IND vs AUS 3rd T20
mictv telugu

టీమిండియా ప్లేయర్లకు ఆతిథ్యమిచ్చిన రామ్ చరణ్!

September 26, 2022

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ‘రామ్ చరణ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘మగధీర’ సినిమాతో స్టార్ హోదాను అందుకున్న చరణ్.. ‘రంగస్థలం’ చిత్రంతో మరో మెట్టు ఎక్కారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వారిద్దరి యాక్టింగ్‌కు ఇండియన్‌ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే భారత ప్లేయర్స్ కలిశారు.

ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ క్రికెట్సర్స్ హార్థిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా మరికొందరు ప్లేయర్స్.. నేరుగా రామ్ చరణ్‌ ఇంటికి వెళ్లారు. చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా వారు కలిశారు. ఇందుకు సంబంధించి మెగా ఫ్యామిలీ సన్నిహితులు పాండ్యాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఉప్పల్‌ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లను రామ్ చరణ్‌-ఉపాసన దంపతులు అభినందించి సన్మానించారట. వారితో కాసేపు సరదాగా మాట్లాడారట. భారత క్రికెటర్ల కోసం చరణ్‌ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారట. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని సమాచారం.