ఆస్పత్రిలోనూ పాండ్యా లగ్జరీ.. చేతికి రూ. 1.3 కోట్ల వాచీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలోనూ పాండ్యా లగ్జరీ.. చేతికి రూ. 1.3 కోట్ల వాచీ..

October 7, 2019

ఆస్పత్రిలో చేరిన బౌలర్ హార్దిక్ పాండ్యా చేతికి ధరించిన ఖరీదైన చేతి గడియారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాని విలు కోటి రూపాయల పైమాటే.  లగ్జరీ యాక్సెసరీస్ ఇష్టపడే పాండ్యా దాన్ని పెట్టుకునే ఆపరేషన్ చేయించుకున్నారా అని కొందరు అడుగుతున్నారు. గాయంతో బాధపడుతూ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన పాండ్యా బ్రిటన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి బెడ్ పైనుంచి తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో పలకరించాడు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న తన అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 

Hardik Pandya.

త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫోటోలో పాండ్యా ధరించిన చేతి గడియారంపై అందరి దృష్టిపడింది. ఆ గడియారం ధర అక్షరాలా కోటీ ముప్పై లక్షల రూపాయల పైనే. ఫాటెక్ ఫిలిప్ నాటిలస్ శ్రేణికి చెందిన ఈ వాచీలకు మార్కెట్‌లో చాలా డిమాండ్ వుంది. అతని ఫోటోపై అభిమానులే కాదు కొందరు సెలబ్రిటీలు కూడా స్పందించారు. బ్రెజిలియన్ మోడల్, టాలీవుడ్‌లో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటించిన ఇజబెల్ లీట్ స్పందించింది. చేతికి గడియారం పెట్టుకునే ఆపరేషన్ చేయించుకున్నావా? అని అడిగింది. పాండ్యా బదులిస్తూ ‘ఎప్పుడూ..’ అని అన్నాడు. కాగా, పాండ్యాకు విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం.  ఇలా ఖరీదైన వస్తువులు వాడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. క్రికెటర్‌గా ఓ స్థాయికి ఎదిగిన తర్వాత తనకెంతో ఇష్టమైన లాంబోర్గిని కారును కొనుక్కుని తన అభిమానులకు కనివిందు చేశాడు.