ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచిన బీజేపీకి కంగ్రాట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచిన బీజేపీకి కంగ్రాట్స్

December 18, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీని, పటేల్ వర్గం నేత  హార్దిక్ పటల్ వివాదాస్పద వ్యాఖ్యలతో అభినందించారు. ‘ఈవీఎంలను ట్యాంపర్ చేసిన గెలిచిన బీజేపీకి నా హార్దిక శుభాకాంక్షు..’ అని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని పటేల్ సామాజిక వర్గం నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు.

సూరత్, రాజ్‌కోట్, అహ్మాదాబాద్‌లలో భారీగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై విపక్షాలు పోరాడాలని కోరారు. తాను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదని, గెలిచిన వారిని అభినందించడం మాత్రమే చేస్తున్నానన్నారు. ఈ ఫలితాలతో సంబంధం లేకుండా కోటా కోసం తమ ఉద్యమ సాగుతుందన్నారు.

ఎన్నికల్లో హార్దిక్‌ను తమవైపు తిప్పుకోవాలన్న బీజేపీ యత్నం బెడిసికొట్టంది. దీంతో పార్టీ వ్యక్తులు కొందరు హార్దిక్ సెక్స్ సీడీలంటూ కొన్నింటిని విడుదల చేశారు. అయినా హార్దిక్ వెనక్కి తగ్గలేదు. గుజరాత్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 22 ఏళ్ల యువకుడి సెక్స్ సీడలను కాదని అన్నారు.