జైలుకెళ్తానన్న భయంతోనే కాంగ్రెస్‌కు హార్ధిక్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

జైలుకెళ్తానన్న భయంతోనే కాంగ్రెస్‌కు హార్ధిక్ రాజీనామా

May 20, 2022

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే తనపై దేశద్రోహం కేసులు నమోదు అవ్వొచ్చని హార్దిక్‌ భావించారని, ఆ భయంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఠాకూర్ మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ తనను తక్కువ చేసిందని, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న హార్దిక్ మాటల్లో నిజం లేదన్నారు. పార్టీ ఆయనకు ప్రతీది ఇచ్చిందని, ఈ మధ్యే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను స్టార్ క్యాంపెయినర్‌ను చేసిందన్నారు. హెలికాఫ్టర్ కూడా ఇచ్చిందని ఠాకూర్ అన్నారు. బీజేపీ సూచనల మేరకే హార్దిక్ ఈ విధంగా మాట్లాడుతున్నాడని, ఆ రాజీనామా లేఖ కూడా బీజేపీ ఆఫీసు నుంచి వచ్చిందేనని తెలిపారు.