Hardik turns emotional as he remembers father after India's win over Pakistan
mictv telugu

పాక్‌ పై గెలుపు.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్థిక్ పాండ్యా

October 24, 2022

నిన్న జరిగిన ఇండియా-పాక్‌ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ముందే దీపావళి వచ్చిందంటూ మురిసిపోయారు. కాగా టీమిండియా విజయంలో విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా కీలక పత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. 37 బంతుల్లో 40 ( ఫోర్‌, 2 సిక్సర్లు) చేసిన పాండ్యా అంతకుముందు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు నేలకూల్చాడు.

 

కాగా టీమిండియా విజయం అనంతరం ఈ ఆల్‌రౌండర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రిని గుర్తుకు చేసుకుని అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ఇప్పుడు నేను మా నాన్న గురించే ఆలోచిస్తున్నా. ఆయన నాకు చేసినట్లే నేను నా కుమారుడికి చేయగలనా అని లోచిస్తున్నా. ఎందుకంటే మా క్రికెట్‌ కలను సాకారం చేయడం కోసం మా నాన్న వ్యాపారాన్ని వదిలి ఒక నగరం నుంచి మరొక నగరానికి కుటుంబాన్ని తీసుకెళ్లేవాళ్లు. అప్పుడాయన ఇలా మాపై నమ్మకం ఉంచకపోతే నేను, కృనాల్‌ ఈ స్థితిలో ఉండేవాళ్లం కాదు. ఈ త్యాగాలకు ఎంతో రుణపడి ఉన్నాం’ అని ఎమోషనల్‌ అయ్యాడు హార్దిక్‌.