Hardik who was shocked.. India's great victory
mictv telugu

అదరగొట్టిన హార్ధిక్.. భారత్ ఘన విజయం

July 8, 2022

 

ఇంగ్లాండ్‌తో గతరాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఆల్‌రౌండర్ షాతో అదరగొట్టాడు. ఇంగ్లాండు ఆటగాళ్లను తన పదునైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో అయోమాయంలో పడిపోయిన ఇంగ్లిష్ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు వికెట్లు కోల్పోయారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో) 51 పరుగులు. దీపక్ హుడా (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో) 33 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో) 39 పరుగులు. కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 5 ఫోర్లతో) 24 పరుగులు, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండు.. మొయిన్ అలీ 36 పరుగులు. డేవిడ్ మలాన్ (21), హారీ బ్రూక్ (28), క్రిస్ జోర్డాన్ (26) పరుగులు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మాథ్యూ పార్కిన్సన్ డకౌట్ కాగా, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.