కేంద్రమంత్రిపై ఫైర్ అయిన హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రిపై ఫైర్ అయిన హరీష్ రావు

April 1, 2022

ngn

యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి పీయూస్ గోయల్‌పై రాష్ట్ర మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరచేలా మాట్లాడిన కేంద్రమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. ప్రజలు నూకలు తినాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గోయల్ ఓ మంత్రిగా కాదు వ్యాపార వేత్తగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులను అవమానించడం తగదని హితవు పలికారు. నూకలైనా తింటాం గానీ, బీజేపీని అధికారం నుంచి దింపుతామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ధాన్యం విషయంలో గత కొంతకాలంగా కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొనమని, కేవలం రా రైస్ మాత్రమే ఎంతైనా కొంటామని కేంద్రం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వమేమో మొత్తం ధాన్యాన్ని కొనమంటోంది. వీరి పోరు ఎప్పుడు కొలిక్కి వస్తుందో? రైతుకు ఎప్పుడు ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.