Harish Rao good news for doctors..orders by Dussehra
mictv telugu

డాక్టర్లకు హరీష్ రావు గుడ్‌న్యూస్..దసరా నాటికి ఉత్తర్వులు

September 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని, దసరా నాటికి వారికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపుపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.

”స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్‌ ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్‌ రెసిడెంట్లను ఇటీవలే ఆయా జిల్లాల్లో నియమించాం. ఇక దుబ్బాకలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు తుదిదశలో ఉంది. 15 రోజుల్లో ప్రారంభమవుతుంది. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్‌ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 103కు చేరాయి. వైద్య,విద్యలో పనిచేస్తున్న అదనపు సంచాలకులు, సంచాలకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాం. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ తీసుకొచ్చాం. దసరా కానుకగా కొత్తగా 1000 మంది వైద్యులను నియమించబోతున్నాం. ఇతర సిబ్బంది నియామక ప్రకటనను కూడా త్వరలో వెల్లడిస్తాం” అని ఆయన అన్నారు. తెలిపారు.