ముంపు బాధితులకు అండ.. వచ్చేవారం జాబ్ మేళా.. హరీశ్ - MicTv.in - Telugu News
mictv telugu

ముంపు బాధితులకు అండ.. వచ్చేవారం జాబ్ మేళా.. హరీశ్

April 14, 2018

తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న రాష్ట్ర సర్కారు నిర్వాసితుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. ముంపు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత కోసం వచ్చే వారం మెగా జాబ్ మేళా నిర్వహించాలని భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు.

‘రిజర్వాయర్ల ఖిల్లా అయిన సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి,  అనంతగిరి,  కొండపోచమ్మ,  మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న గ్రామా ప్రజల కోసం మెగా ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం..’ అని ఆయన తెలిపారు.

శనివారం సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ పి. వెంకట రామారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఫిఫ్త్ రీచ్ స్ట్రాటజిక్ ప్రతినిధులతో మంత్రి సమావేశమై.. జాబ్ మేళా నిర్వహణపై చర్చించారు. ఆయా ముంపు ప్రాంతాలలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా, ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు కావాల్సిన అర్హతలు సాధించేలా శిక్షణను సైతం ఇప్పించేలా ఒక ప్రత్యేక ప్రణాళికను హరీశ్ రావు చొరవతో రూపొందించారు.

కలెక్టర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో మేళా ఉంటుందని, మెగా జాబ్ మేళాను వచ్చేవారం నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తామని హరీశ్ రావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేటు కంపెనీలైన టాటా, న్యాక్,  నవయువ, డీఆర్డీఏ వారి సహకారంతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీల సాయం తీసుకుంటున్నామన్నారు.  ముంపు గ్రామాల యువతకు ఉపాధి దొరికేలా డిప్లొమా పీజీ పాలిటెక్నిక్ తదితర ఉత్తర వాటిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామనని వెల్లడించారు.