హరీష్ రావు కీలక ప్రకటన.. ఇకపై నార్మల్ డెలివరీ చేస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

హరీష్ రావు కీలక ప్రకటన.. ఇకపై నార్మల్ డెలివరీ చేస్తే..

June 8, 2022

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం అందజేస్తామని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, ప్రజారోగ్యం కోసం మార్పు తెవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని ఆయన అన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ..” తెలంగాణలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తేడా ఏమిటో ప్రజలకు తెలియాలి. ఇటీవల కాలంలో సిజేరియన్లు భారీగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నార్మల్ డెలివరీలు చేయించేవారికి రూ. 3000 పారితోషకాన్ని అందజేస్తాం.” అని ఆయన అన్నారు.

మరోపక్క గతకొన్ని నెలలుగా తెలంగాణలో సిజేరియన్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలకు వెళ్లినవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. సిజేరియన్లు అరికట్టడానికి, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడానికి కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం. ఈ మధ్య కొంతమంది ముహూర్తాలను చూసుకుని డెలివరీలను చేసుకుంటున్నారు. మరికొంతమందికి డెలివరీలకు వెళితే పెద్ద ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీటన్నింటిని అరికట్టడానికి నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరాలను వెల్లడించారు.