జగన్‌లా చేసి ఉంటే నష్టపోయేవాళ్లం.. హరీష్ రావు హాట్ కామెంట్స్
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న అభివద్ధి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తరచూ చర్చ జరుగుతోంది. గతంలో కేటీఆర్ సహా కొందరు మంత్రులు ఏపీలోని సమస్యలతో పోల్చి చూస్తే తెలంగాణ చాలా నయమని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఆ జాబితాలో చేరిపోయారు.
ఇటీవల తిరుమల దర్శనానికి వెళ్లిన హరీష్ రావు అక్కడి కరెంట్ పరిస్థితిపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీచర్ల మీద ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ ప్రభుత్వం టీచర్లపై వ్యవహరిస్తున్నట్టుగా చేసి ఉంటే చాలా నష్టపోయేవారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీచర్లకు మంచి ఫిట్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే విద్యుత్ చట్టంపై జగన్‌లా ఒప్పుకుని ఉంటే రాష్ట్రానికి 35 వేల కోట్లు వచ్చేవని, దానితో అనేక కొత్త పథకాలు పెట్టేవారమని ఎద్దేవా చేశారు. రైతుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం లేనందువల్లే తిరస్కరించామని అన్నారు.